పురుగుల మందు తాగి బలవన్మరణం
eenadu telugu news
Published : 21/10/2021 06:10 IST

పురుగుల మందు తాగి బలవన్మరణం


పోలయ్య(పాత చిత్రం)

రణస్థలం, న్యూస్‌టుడే: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రణస్థలం మండలంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిల్లపేట రాజాం గ్రామానికి చెందిన కొంతాల పోలయ్య(38) భార్యకు ఇతనికి వివాదం ఏర్పడడంతో కొన్నాళ్ల పాటు పిల్లలతో ఆమె పైడిభీమవరంలో ఉండేవారు. మూడు నెలల కిందట భర్త వద్దకు వచ్చారు. ఏం జరిగిందో ఏమో మంగళవారం రాత్రి పోలయ్య మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఇంటికి వచ్చాడు. ఉదయం లేచే సరికి అతను మృతి చెంది ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని