మత్తుకు బానిస కావొద్దు
eenadu telugu news
Published : 24/10/2021 06:09 IST

మత్తుకు బానిస కావొద్దు

మాదకద్రవ్యాలకు బానిస కాకుండా యువత సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్పీ అమిత్‌బర్దార్‌ హితవు పలికారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శ్రీశివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్‌’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. హాజరైన ఎస్పీ మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి దశ కీలకమైందని, ఈ సమయంలో మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దన్నారు. నైతిక విలువలతో కూడిన విద్యనభ్యసించి నవసమాజం నిర్మాణానికి దోహదపడాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రధానాచార్యులు బాలభాస్కర్‌, ఏఎస్పీ కె.శ్రీనివాసరావు, డీఎస్పీ సి.హెచ్‌.ప్రసాద్‌ పాల్గొన్నారు.

 - న్యూస్‌టుడే, ఎచ్చెర్ల


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని