ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల
eenadu telugu news
Published : 24/10/2021 06:09 IST

ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల

శ్రీకాకుళం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎక్కువ మార్కులు ఆశిస్తున్న విద్యార్థులకు సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. మొదటి ఏడాది విద్యార్థులు అధిక సంఖ్యలో పరీక్ష రాయగా... ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులు రెండు... మూడు శాతం కంటే ఎక్కువ మంది హాజరు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 113 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలను 31,134 మంది విద్యార్థులకుగాను 25 వేల మందికి పైగానే రాశారు. వీరందరికీ పరీక్షల ఆధారంగా మార్కులను ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని