నీలమణిదుర్గ ఆలయ ప్రాంగణం తొలగింపు
eenadu telugu news
Published : 24/10/2021 06:09 IST

నీలమణిదుర్గ ఆలయ ప్రాంగణం తొలగింపు

సింహద్వారాన్ని కూల్చివేస్తున్న దృశ్యం

పాతపట్నం, న్యూస్‌టుడే : పాతపట్నం రైలు నిలయం సమీపంలో జాతీయ రహదారిపై నిర్మించ తలపెట్టిన ప్లైఓవర్‌ వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా రహదారికి ఆనుకుని ఉన్న నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణం తొలగింపు పనులను అధికారులు శనివారం చేపట్టారు. ఆలయ ప్రహరీ, సింహద్వారం, ధ్వజస్తంభంపై శ్లాబు, సమీపంలో ఉన్న శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంతో పాటు పక్కనే ఉన్న వినాయక ఆలయాన్ని పూర్తిగా కూల్చివేశారు. ముందుగా సమాచారం ఇవ్వకపోవడంపై అర్చకులు రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. కొన్నేళ్లుగా ఆ ఆలయాలను నమ్ముకొని అర్చకులు జీవనం సాగిస్తున్నారని, వారికి న్యాయం చేయాలని స్థానికులు కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని