వివాహిత ఆత్మహత్య
eenadu telugu news
Published : 24/10/2021 06:09 IST

వివాహిత ఆత్మహత్య

చంద్రకళ (పాత చిత్రం)

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: సీహెచ్‌.కపాసుకుద్దిలో వివాహిత బైపిల్లి చంద్రకళ(24) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జి.అప్పారావు తెలిపారు. అత్తవారి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని ఆమె తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహానికి సోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్ట నిర్వహించారు. చంద్రకళకు నాలుగేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు కుమారులున్నారు. భర్త జోగారావు చేపలవేటకు వెళ్తుంటారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని