అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
eenadu telugu news
Published : 24/10/2021 06:09 IST

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఆమదాలవలస పోలీసులు శనివారం పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీఐ పైడయ్య వెల్లడించారు. కోల్‌కతాకు చెందిన ముగ్గురు వ్యక్తులు 19న శ్రీకాకుళంరోడ్డు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకువస్తానన్న వ్యక్తి రాకపోవడంతో వారు స్థానికంగా ఉండిపోయారు. 22న గంజాయి ముఠా ప్రధాన నిందితుడు షమీర్‌షేక్‌ సరకు వీరికి అందించాడు. బీర్‌నగర్‌ సమీపంలో తనిఖీలు చేస్తుండగా వీరు బ్యాగులను విడిచిపెట్టి పరుగెడుతుండటంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. బ్యాగులను పరిశీలించగా 43 కిలోల గంజాయి దొరికింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్‌.ఐ. రఘునాథరావు కేసు నమోదు చేశారు. వారి రిమాండుకు తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని