మూగజీవాన్ని కాపాడారు
eenadu telugu news
Published : 24/10/2021 06:09 IST

మూగజీవాన్ని కాపాడారు

ఆవును బావి నుంచి బయటకు తీస్తున్న సిబ్బంది

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ఇందిరా కూడలిలోని బావిలో ప్రమాదవశాత్తూ పడిన ఆవును రక్షించి టెక్కలి అగ్నిమాపక సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం వేకువజామున టీ దుకాణం వద్దకు వచ్చిన స్థానికులు బావి నుంచి అరుపులు విని పరిశీలించగా, బావిలో పడిన ఆవు కన్పించింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అధికారి మల్లేశ్వరరావు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. కాస్త లోతులో ఉండటంతో బయటకు తీయడం సాధ్యం కాలేదు. అగ్నిమాపక వాహన ట్యాంకులోని నీటిని బావిలోకి విడిచిపెట్టారు. దీంతో బావిలో నీటిమట్టం పెరిగి ఆవు కాస్త పైకి వచ్చింది. స్థానికుల సాయంతో దాన్ని బయటకు తీశారు. బావిలో గతంలో ఓ మహిళ పడిపోగా, స్థానికులు రక్షించారు. నిత్యం రద్దీగా ఉంటున్నందున బావి పైభాగంలో చట్రాన్ని ఏర్పాటుచేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని