‘కుల గణనలో ఓబీసీలను చేర్చాలి’
eenadu telugu news
Published : 24/10/2021 06:20 IST

‘కుల గణనలో ఓబీసీలను చేర్చాలి’

మాట్లాడుతున్న శంకరరావు, చిత్రంలో సంఘాల నాయకులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: కేంద్రం ప్రభుత్వం చేపట్టబోయే కులగణనలో ఓబీసీ ప్రత్యేకంగా కాలమ్‌ కేటాయించాలని, లేకుంటే కులగణనను బహిష్కరిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు హెచ్చరించారు. శ్రీకాకుళం నగరంలోని సంఘ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో వెనుబడిన బీసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఓబీసీల వివరాలను సేకరించాలన్నారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సులు కేంద్రం తక్షణమే అమలు చేయాలని డిమాండు చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కె.క్రాంతికుమార్‌, సమన్వయకర్త బ్రహ్మానందశర్మ, జిల్లా అధ్యక్షుడు జి.వెంకటరమణమూర్తి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని