గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులకు కౌన్సెలింగ్‌
eenadu telugu news
Published : 26/10/2021 04:11 IST

గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులకు కౌన్సెలింగ్‌


ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న సిబ్బంది

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాపరిషత్తు యాజమాన్యంలోని ఉద్యోగ విరమణ, మరణానంతరం ఏర్పడిన గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసే నిమిత్తం డీఈవో జి.పగడాలమ్మ చర్యలు చేపట్టారు. 22 మంది అర్హుల ధ్రువపత్రాలను సోమవారం శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశీలించారు. వీరిలో 17 మంది ఉద్యోగోన్నతులకు అంగీకరించగా వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి పాఠశాలలను కేటాయించారు. మిగిలిన అయిదుగురు ఉద్యోగోన్నతులకు అంగీకారం తెలపలేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని