అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌
eenadu telugu news
Published : 26/10/2021 04:11 IST

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌


ఫిర్యాదులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, జేసీలు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), శ్రీకాకుళం అర్బన్‌, సీతంపేట, న్యూస్‌టుడే: స్పందన కార్యక్రమానికి వస్తున్న అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి 268 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో పరిష్కరించేలా ఆయా శాఖాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు సుమిత్‌కుమార్‌, కె.శ్రీనివాసులు, డీఆర్వో బలివాడ దయానిధి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్‌కు 28 వినతులు అందాయి. అదనపు ఎస్పీ పి.సోమశేఖర్‌ వీటిని స్వీకరించారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ పీవో బి.నవ్య ఆధ్వర్యంలో గిరిజన స్పందన నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనులు హాజరై 92 వినతులు అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని