క్రీడల అభివృద్ధికి తోడ్పాటు అవసరం: ఉప ముఖ్యమంత్రి
eenadu telugu news
Published : 26/10/2021 04:11 IST

క్రీడల అభివృద్ధికి తోడ్పాటు అవసరం: ఉప ముఖ్యమంత్రి


జూడో పోటీలను ప్రారంభించి తిలకిస్తున్న ధర్మాన కృష్ణదాస్‌

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో క్రీడల అభివృద్ధికి అంతా సహకారం అందజేయాలని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర, జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. జూనియర్‌, కేడెట్‌ బాల బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి జూడో పోటీలకు క్రీడాకారుల ఎంపికలను సోమవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ పురుషుల కళాశాల ఆవరణలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎంతోమంది రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నారని, వారికి దాతలు సహకరిస్తే మరింతగా రాణించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా జూడో సంఘం ఛైర్మన్‌ ఫ్రొఫెసర్‌ చింతాడ రవికుమార్‌, ఉపాధ్యక్షుడు బి.రామకృష్ణ సమకూర్చిన దుస్తులను క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి.సూర్యప్రకాశ్‌, ఎం.వి.రమణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సునీత, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు డా.కళ్లేపల్లి శ్రీధరరావు, ఒలింపిక్‌ సంఘం జిల్లా కార్యదర్శి పి.సుందరరావు, శిక్షకులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని