3,76,255 మందికి రైతు భరోసా
eenadu telugu news
Published : 26/10/2021 04:11 IST

3,76,255 మందికి రైతు భరోసా

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రైతు భరోసా కింద జిల్లాలో 3,76,255 మందికి రూ.81.87 కోట్లు లబ్ధి చేకూరనుంది. మంగళవారం ముఖ్యమంత్రి ఆన్‌లైన్‌ విధానంలో రైతుల ఖాతాల్లో నిదులు జమ చేయనున్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం కింద ఏటా రూ.13,500 జమ చేయడం జరుగుతుందని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలో 3,65,852 మంది భూ యజమానులకు రూ.77.71 కోట్లు, 8494 మంది అటవీ, కౌలు, దేవాదాయశాఖ భూములను చేసే రైతులకు రూ.4.16 కోట్లు అందనుందని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని