రెజ్లింగ్‌లో బోరుభద్ర యువకుడి సత్తా
eenadu telugu news
Published : 26/10/2021 04:21 IST

రెజ్లింగ్‌లో బోరుభద్ర యువకుడి సత్తా

 

కాంస్య పతకంతో హర్షవర్దన్‌

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలో సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన యువకుడు సత్తా చాటాడు. అండర్‌-18 కేటగిరీ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. బోరుభద్రకు చెందిన వల్లభ హర్షవర్దన్‌ దిల్లీలో ఈ నెల 20 నుంచి 24వ వరకు జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని బాలుర అండర్‌-18 విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ నెల 2, 3వ తేదీల్లో అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. హర్షవర్దన్‌ తండ్రి వల్లభత్రినాథరావు సీమెన్‌గా పని చేస్తుండగా, తల్లి మహాలక్ష్మి గృహణి. ఈ సందర్భంగా ఇతన్ని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని