దాడులకు పాల్పడితే సహించేది లేదు: శిరీష
eenadu telugu news
Published : 26/10/2021 04:21 IST

దాడులకు పాల్పడితే సహించేది లేదు: శిరీష

 

మాట్లాడుతున్న గౌతు శిరీష, చిత్రంలో ఇతర నేతలు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: తమ నాయకులు, కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడులకు పాల్పడితే సహించేది లేదని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గం ఇన్‌ఛార్జి గౌతు శిరీష హెచ్చరించారు. సోమవారం బాధితులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందించిన అనంతరం శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వజ్రపుకొత్తూరు మండలంలో తమ వర్గీయుల ఇళ్లపై మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరులు దాడి చేసి ఇష్టానుసారం కొట్టడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు విడనాడకుంటే ఊరుకునేది లేదని ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు. పలాసలో పోలీసులు మంత్రి చెప్పినట్లు నడుచుకుని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీకి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై కలెక్టర్‌, ఎస్పీకి వివరించామన్నారు. బాధితులు మాట్లాడుతూ వైకాపావారు తమ ఇళ్లపై దాడి చేసిన తీరును వివరించారు. ఈ కార్యకమ్రంలో సింతు సుధాకర్‌, తమ్మినేని సుజాత, మెండ దాసునాయుడు, పీఎంజే బాబు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని