స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన
eenadu telugu news
Published : 26/10/2021 04:27 IST

స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన


కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్న న్యాయమూర్తి హరిత

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : మహిళలు స్వయంఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సీనియర్‌ సివిల్‌జడ్జి టి.హరిత అన్నారు. స్థానిక రోటరీనగర్‌లోని సత్యసాయి శాంతిసుధ మందిరంలో సోమవారం ఏర్పాటుచేసిన టైలరింగ్‌ మూడోవిడత శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యసాయి సేవాసంస్థలు చేపడుతున్న సేవా, శిక్షణ కార్యక్రమాలు అభినందించారు. ఈసందర్భంగా పలువురికి ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారు. రాష్ట్రస్థాయి బాలవికాస్‌ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని