పోలీసు అమరుడికి ఘన నివాళి
eenadu telugu news
Published : 26/10/2021 04:27 IST

పోలీసు అమరుడికి ఘన నివాళి


జర్జంగి మెయిన్‌రోడ్‌ను అన్నెపు పాపారావు వీధిగా నామకరణం చేస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

జర్జంగి(కోటబొమ్మాళి), న్యూస్‌టుడే: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జర్జంగి మెయిన్‌రోడ్డుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు దివంగత అన్నెపు పాపారావు వీధిగా నామకరణం చేస్తున్నట్లు డీఎస్పీ(శిక్షణ సంస్థ) డి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జర్జంగిలో సోమవారం పోలీసుల అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా అన్నెపు పాపారావు వీధి బోర్డును డీఎస్పీ ఆవిష్కరించి, ఆయన సేవలు కొనియాడారు. అనంతరం ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రతినిధులు, అధికారులతో పోలీసుల అమరవీరుల వారోత్సవాల ర్యాలీ చేశారు. ఎంపీటీసీ తులసీభాయి, నాయకులు రామారావు, ఇన్‌ఛార్జి ఎంపీడీవో సంపతిరావు రాజేశ్వరమ్మ, తహసీల్దార్‌ సూర్యనారాయణ, ఎస్‌ఐ రవికుమార్‌, ఏఎస్‌ఐ నాగభూషణరావు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని