రక్తదానంతో ప్రాణాలు నిలుపుదాం
eenadu telugu news
Published : 26/10/2021 04:33 IST

రక్తదానంతో ప్రాణాలు నిలుపుదాం


రక్తదానం చేస్తున్న ఎస్సై సత్యనారాయణ

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను నిలుపుదామంటూ కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి పేర్కొన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మండలం పరిధి హృదయం ఫౌండేషన్‌, ప్రాణదాత, రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ల సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని సీఐ ఎం.వినోద్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ సహా సుమారు 70 మంది యువకులు రక్తం దానంచేశారు. కవిటి ఎస్సై అప్పారావు, ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు కె.మిన్నారావుతో పాటు, రెడ్‌క్రాస్‌, ప్రాణదాత బ్లడ్‌ బ్యాంకు ప్రతినిధులు, యువజన సంఘల ప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


నేడు మెగా రక్తదాన శిబిరం


ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : టెక్కలిలో మంగళవారం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న డివిజన్‌ స్థాయి మెగా రక్తదాన శిబిరానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. టెక్కలి-తెంబూరు రోడ్డులో జిల్లా ఆసుపత్రి నూతన భవన సముదాయంలో ఏర్పాట్లను సబ్‌కలెక్టర్‌ వికాస్‌మర్మత్‌ సోమవారం పరిశీలించారు. ప్రధానంగా నీరు, విద్యుత్తు సమస్యల్లేకుండా చర్యలు చేపట్టాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కణితి కేశవరావును సూచించారు. డివిజన్‌లోని ప్రతి మండలకేంద్రం నుంచి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటుచేశామన్నారు. రెవెన్యూ, పోలీసుశాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు, ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులతో శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.

సమస్యల పరిష్కారానికి చొరవ: స్పందనలో వచ్చిన వినతులపై పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌ అన్నారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 18 వినతులు అందాయి. పెద్దతామరాపల్లి వద్ద సర్వీసు రోడ్డు మీదుగా బస్సులు నడపాలని స్థానికులు కోరారు. రేషన్‌డిపో డీలరుపై చర్యలు తీసుకోవాలని మండపల్లి గ్రామస్థులు కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని