జిల్లాలో కొవిడ్‌ మృతులు 794 మంది!
eenadu telugu news
Published : 28/10/2021 03:56 IST

జిల్లాలో కొవిడ్‌ మృతులు 794 మంది!

 

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కరోనాతో మృతిచెందిన వారికి ప్రభుత్వం రూ.50 వేల వంతున ఇవ్వాలని నిర్ణయించడంతో జిల్లా అధికారులు ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించారు. కొవిడ్‌ రెండు దశల్లో జిల్లా వ్యాప్తంగా 794 మంది మృతిచెందినట్లు అధికారికంగా గుర్తించారు. తాజా ఉత్తర్వులతో వీరందరికీ ఆయా ఆర్థికసాయం త్వరలో అందనుంది. కాగా మరణాల గణాంకాల్లో తేడాలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇతర జిల్లాలకు చికిత్స నిమిత్తం వెళ్లి మృతిచెందిన వారి వివరాలు ఇందులో పొందుపర్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది. జిల్లా అధికారులు తక్కువ మరణాలే చూపిస్తున్నారని, బాధిత కుటుంబాలు అందరికీ న్యాయం చేయాలని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కేసీ చంద్రనాయక్‌ వద్ద ప్రస్తావించగా జిల్లాలో 794 మంది కొవిడ్‌తో మృతి చెందారని, వీరందరికీ పరిహారం అందనుందన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే అవసరమైన చర్యలు ప్రారంభిస్తామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని