ప్రజా సంఘాల నాయకులు అరెస్టు
eenadu telugu news
Published : 28/10/2021 04:17 IST

ప్రజా సంఘాల నాయకులు అరెస్టు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: మరోపర్యాయం పోలీసులు పలు గ్రామాలపై బుధవారం వేకువజామున దాడులు చేసి పలువురు ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేశారు. చినవంకకు చెందిన బాధిత మహిళకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు రెండు రోజుల కిందట సభ నిర్వహించిన విషయం తెలిసిందే. చినవంకకు చెందిన శ్రీనివాసరావు సదరు మహిళను మోసగించి, ప్రస్తుతం తనకేమీ తెలియదంటున్నారని ఆరోపిస్తూ ఆయనపై చర్య తీసుకోవాలని కోరారు. అదే రోజు శ్రీనివాసరావు, తన కుమారుల ఫిర్యాదు మేరకు బాధిత మహిళతో పాటు 15 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి కోర్డు రిమాండు విధించింది. ఈ కేసులో భాగంగా.. బుధవారం వేకువజామున తిరిగి పోలీసులు పల్లిసారధి, బొడ్డపాడు, రాజాం, మాకన్నపల్లి గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజా సంఘాల నాయకుల ఇళ్లపై దాడి చేశారు. అరుణ, కుసుమ, దానేష్‌, వీరాస్వామి, నీలకంఠంలను అరెస్టు చేసి వజ్రపుకొత్తూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం పలాస కోర్టులో హాజరుపరిచామని, వారికి 15 రోజుల రిమాండు విధించినట్టు ఎస్‌ఐ కె.గోవిందరావు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని