అమర పోలీసు మాతృమూర్తికి సన్మానం
eenadu telugu news
Published : 28/10/2021 04:17 IST

అమర పోలీసు మాతృమూర్తికి సన్మానం


బంగారునాయుడు తల్లిని సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న డీఎస్పీ బాలరాజు

డెంకాడ, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని గునుపూరుపేటకు చెందిన అమర పోలీసు ఎస్‌ఐ సంగిరెడ్డి బంగారునాయుడు కుటుంబ సభ్యులను శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ కె.బాలరాజు బుధవారం పరామర్శించారు. మందస మండలం బేతలపురం వద్ద 1992 మార్చి 24న మావోయిస్టుల కాల్పుల్లో ఆయన వీర మరణం పొందారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా బంగారునాయుడు చిత్రపటానికి పూలమాల వేసి డీఎస్పీ నివాళులు అర్పించారు. ఎస్పీ అమిత్‌ బర్దార్‌ ఆదేశాల మేరకు గునుపూరుపేట వెళ్లి ఆయన మాతృమూర్తి అప్పలనర్సమ్మను శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆమెతో మాట్లాడి ఏమైనా సమస్యలుంటే ఎస్పీ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని