బలగ ప్రకాశరావుకు ఇండియన్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం
eenadu telugu news
Published : 28/10/2021 04:17 IST

బలగ ప్రకాశరావుకు ఇండియన్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

 

టెక్కలి, న్యూస్‌టుడే: నందిగాం మండలంలోని బడగాం గ్రామానికి చెందిన సామాజికవేత్త, చలనచిత్ర నిర్మాత బలగ ప్రకాశరావును ఇండియన్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం వరించింది. న్యూదిల్లీకి చెందిన కేంద్రప్రభుత్వ అనుబంధ సంస్థ అభిజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఈ పురస్కారాన్ని అందించింది. 2021 సంవత్సరానికిగాను గ్రామీణాభివృద్ధి విభాగంలో ఆయనను ఎంపిక చేసింది. ఈనెల 30న దిల్లీలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా చేతులమీదుగా ఈయన పురస్కారం అందుకోనున్నారు. ఇప్పటికే ఇండియన్‌ ఎఛీవర్స్‌ అవార్డు, దాదా సాహెబ్‌ఫాల్కే ఫిల్మి ఫెస్టివల్‌ అవార్డును అందుకున్న ప్రకాశరావుకు ఈ ఏడాది మరో పురస్కారం దక్కనుండటంతో ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని