రాణెమ్మ చెరువు వద్ద రసాభాస
eenadu telugu news
Published : 28/10/2021 04:17 IST

రాణెమ్మ చెరువు వద్ద రసాభాస


పోలీసులు, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం

బూర్జ, న్యూస్‌టుడే: ఓవీపేట రాణెమ్మ కోనేరు చెరువు వద్ద బుధవారం రసాభాస చోటు చేసుకుంది. గ్రామస్థుల సాయంతో జనసేన యువకులు కోనేరును అభివృద్ధి చేస్తే దాన్ని స్థానిక నాయకులు స్పీకర్‌తో ప్రారంభించడం సరికాదంటూ జనసేన ఆమదాలవలస ఇన్‌ఛార్జి బి.రామ్మోహన్‌రావు నిరసన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని గొడవను సర్దుబాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, జనసేన నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ విషయమై ఉప ఎంపీపీ సూర్యారావు మాట్లాడుతూ అందరి సహకారంతో కోనేరును అభివృద్ధి చేశామని, పంచాయతీ పెద్దల అనుమతితోనే స్పీకర్‌తో ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని