ఆర్థిక సహాయం అందజేత
eenadu telugu news
Published : 28/10/2021 04:17 IST

ఆర్థిక సహాయం అందజేత


బాధిత కుటుంబసభ్యురాలికి చెక్కు అందిస్తున్న అధికారులు

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: కరోనా బారినపడి మృతిచెందిన పోలీసు కుటుంబాలకు మాన్‌కైండ్‌ పార్మా సంస్థ ఆర్థిక సాయం అందజేసింది. బుధవారం దూరదృశ్య విధానంలో జరిగిన కార్యక్రమంలో హోంశాఖ మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ పి.సోమశేఖర్‌ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. కొవిడ్‌బారిన పడి చనిపోయిన ఎస్‌ఈబీ ఎస్‌ఐ బంగార్రాజు, హెచ్‌సీ బీవీజీరెడ్డి, హోంగార్డు ఎల్‌.సత్యనారాయణలకు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున సంబంధిత కుటుంబీకులకు ఇచ్చారు. అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీ శేఖర్‌, ఏఓ శివరామరాజు, పోలీసు అసోసియేషన్‌, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని