సామాజిక అంశాలపై అవగాహన అవసరం
eenadu telugu news
Published : 28/10/2021 04:17 IST

సామాజిక అంశాలపై అవగాహన అవసరం


చిత్రాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులతో డీఈవో పగడాలమ్మ, తదితరులు

శ్రీకాకుళం విద్యావిభాగం, న్యూస్‌టుడే: సామాజిక అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకే పోటీలను నిర్వహిస్తున్నట్లు డీఈవో జి.పగడాలమ్మ తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మూడు డివిజన్‌లలో బుధవారం సేవ్‌ గర్ల్‌ ఛైల్డ్‌ అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్‌ పోటీలు నిర్వహించారు. శ్రీకాకుళం డివిజన్‌కు సంబంధించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోటీలు జరిగాయి. వీటిని డీఈవో స్వయంగా పర్యవేక్షించారు. న్యాయనిర్ణేతలుగా విశ్రాంత ఉపాధ్యాయులు ఎస్‌.వి.రమణ, పి.కూర్మారావు, ఎ.బలరామకృష్ణ వ్యవహరించారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారిణి ఆర్‌.విజయకుమారి, డీసీఈబీ జిల్లా కార్యదర్శి జి.రాజేంద్రప్రసాద్‌, ప్యాప్టో ఛైర్మన్‌ పేడాడ దాలినాయుడు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని