close

శుక్రవారం, నవంబర్ 27, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చేతులే ఆయుధాలుగా చోరీలు

మూసి ఉన్న దుకాణాలే లక్ష్యం

అచ్యుతాపురంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఎలమంచిలి సీఐ, అచ్యుతాపురం ఎస్సై

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మూసి ఉన్న దుకాణాలే చోరీలకు కేంద్రాలుగా మార్చుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అచ్యుతాపురం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎలమంచిలి సీఐ నారాయణరావు, అచ్యుతాపురం ఎస్సై లక్ష్మణరావు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ముఠా వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన షేక్‌ బాషా (57) భార్యను సొంత రాష్ట్రంలో వదిలేసి విశాఖలోని దొండపర్తిలో మరో మహిళ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఇతడు దొంగతనాలనే జీవనోపాధిగా మార్చుకున్నాడు. కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన రాజన్‌ రంజిత్‌ (32), విశాఖ నగరంలోని మధురవాడ వాంబే కాలనీకి చెందిన కాగన్‌ గణేష్‌ (24), దొరడపర్తికి చెందిన శివ (27)తో కలిసి ఈనెల 16న అచ్యుతాపురం సెజ్‌ రోడ్డులోని సూపర్‌మార్కెట్‌లో రూ. 80 వేల నగదు చోరీ చేశాడు. ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దుకాణంలో నిందితుడి వేలిముద్రలు చిక్కాయి. ఈంఒ బాషావని తేలడంతో పోలీసులు అప్రమత్తమై విశాఖలో అతడి గురించి గాలించి నివాసం ఉండే ప్రాంతం, అతనితో సహజీవనం చేస్తున్న మహిళ కుమారుడు పనిచేస్తున్న ప్రాంతం తెలియడంతో మాటువేసి అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో మిగిలిన ముగ్గురూ అనకాపల్లి జాతీయ రహదారి పక్కన మరో దుకాణం వద్ద చోరీ చేయడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నారాయణరావు తెలిపారు. ముఠా సభ్యుల్లో ఒకడైన శివ బధిరుడు, మూగ అయినా చాకచక్యంగా చోరీలకు పాల్పడుతుంటాడని పేర్కొన్నారు.

ప్రాంతానికో పేరు...చోరీకో కొత్త బృందం: బాషా ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడ్డాడు. ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లో 20 దొంగతనాలు చేసి కోర్టులో నేరాన్ని అంగీకరించి ఏడుసార్లు జైలు జీవితం అనుభవించి వచ్చాడు. విజయవాడలో ఒకే రోజు ఐయిదు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డాడు. ఎంపిక చేసుకున్న ప్రాంతానికి ముందురోజు నలుగురు వ్యక్తులతో కలిసి వెళ్తాడు. దుకాణాలకు సంబంధించిన షట్టర్లను ఎటువంటి ఆయుధాలను ఉపయోగించకుండా కేవలం మెడలో ఉండే తువ్వాలు సాయంతో పైకిలేపి కేవలం అయిదు నిమిషాల్లో నగదుతో పరారవుతాడు. తెల్లవారుజాము 2 గంటల తరవాతే చోరీలకు పాల్పడతాడు. దుకాణంలో ఎంత విలువైన వస్తువులు ఉన్నా వాటి జోలికి వెళ్లకుండా కేవలం డబ్బులు మాత్రమే అపహరిస్తాడు. ఒకసారి చోరీకి తీసుకెళ్లిన బృందాన్ని మరోసారి తీసుకెళ్లడు. ప్రాంతం మారినప్పుడల్లా పేరు మార్చుకుని తిరుగుతుంటాడు. జైల్లో పరిచయం అయిన పాత నేరస్తులతో కలిసి పోలీసులకు చిక్కకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చోరీలు చేయాలో పసిగట్టాడని పోలీసులు వివరించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.