Published : 12/04/2021 03:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎండుటాకు ఆకారం.. కదిపితే కీటకం

చిత్రంలో కనిపిస్తోంది ఎండిపోయిన ఆకు అనుకుంటే పొరబడినట్లే. ఇది ఆకు కాదు.. కీటకం. కదలకుండా  కాళ్లు లోపల పెట్టుకున్న ఈ జీవిని ఎవరైనా తాకితే వెంటనే పైకి ఎగిరిపోతుంది. గూడెంకొత్తవీధిలో ఆదివారం ‘న్యూస్‌టుడే’ కెమెరా ఈ కీటకాన్ని క్లిక్‌మనిపించింది. ఇది టెట్టిగొనిడే కుటుంబానికి చెందిన మైమెటిక జాతి కీటకమని రాంబిల్లి బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్‌ తెలిపారు. రెక్కలు పూర్తిగా ఆకుల్లా ఉండడం వల్ల శత్రు కీటకాలు, జంతువుల నుంచి సులభంగా తప్పించుకుంటాయని వివరించారు. అడవిలో ఆకుల్లో కలిసిపోయి ఆకులను, పువ్వులను,  చనిపోయిన కొన్ని కీటకాలను తింటూ జీవిస్తాయని చెప్పారు.

- న్యూస్‌టుడే, గూడెంకొత్తవీధి (చింతపల్లి)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని