Published : 12/04/2021 03:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహమ్మారికి చిక్కొద్దు

కొవిడ్‌ మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని అవగాహన కల్పిస్తూ మిస్‌ వైజాగ్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బీచ్‌ రోడ్డులో ర్యాలీ జరిగింది. జీవీఎంసీ మేయరు హరివెంకట కుమారి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. లయన్స్‌ బ్లడ్‌ బ్యాంకు ట్రస్టీ ఆచార్య దుర్గాప్రసాద్‌,  మిస్‌ వైజాగ్‌ యువతులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, విశాఖపట్నం

రోజు వ్యవధిలో 405 కేసులు
విశాఖపట్నం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 405 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇవే అత్యధికమని ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తెలిపారు. తాజా కేసులతో బాధితుల సంఖ్య 65,270కు చేరిందన్నారు. ఒక్కరోజు వ్యవధిలో 202 మంది కోలుకోగా వీరి సంఖ్య 62,069కు చేరిందన్నారు. ప్రస్తుతం 2643 మంది చికిత్స పొందుతున్నారని ప్రిన్సిపల్‌ వివరించారు. కొత్తగా ఎవరూ    కొవిడ్‌తో మృతి చెందలేదని, ఇంతవరకు 558 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
రెండు రోజులకు సరిపడా టీకా నిల్వలు
మాడుగుల: మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రిలో మరో రెండు రోజులకు సరపడా కరోనా వ్యాక్సిన్‌ డోసులు ఉన్నాయని వైద్యాధికారి సూర్యప్రకాశరావు తెలిపారు. ఈ నెల 12, 15 తేదీల్లో వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. 600 డోసులు అవసరమని ప్రతిపాదనలు పంపనున్నట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని