Published : 12/04/2021 03:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాచ్‌ఖండ్‌లో పడిపోయిన విద్యుదుత్పత్తి

మూడు రోజుల క్రితం ఆరో నంబరు జనరేటర్‌ ప్రారంభిస్తున్న అధికారులు

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్రా, ఒడిశా  ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి పడిపోయింది. ఆరు జనరేటర్లు, గంటకు 120 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ కేంద్రంలో ప్రస్తుతం విద్యుదుత్పత్తి 59 మెగావాట్లకు తగ్గింది. తాజాగా నాలుగో నంబరు జనరేటర్‌కు గవర్నర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. మూడో నంబరు జనరేటరుకు సంబంధించిన బేరింగ్‌లు చెడిపోయాయి. ఏడాదిగా నిలిచిపోయిన ఆరో నంబరు జనరేటరు మరమ్మతులు పూర్తిచేసి మూడు రోజుల క్రితం వినియోగంలోకి తీసుకురాగా.. వెంటనే మొరాయించింది. ప్రస్తుతం 1, 2, 5 జనరేటర్ల సాయంతో గంటకు 59 మెగావాట్లతో సరిపెట్టుకుంటున్నారు. వివిధ లోపాలతో జనరేటర్లు మొరాయిస్తుంటే   అధికారులు, ఉద్యోగులు వారం రోజులుగా రాత్రి 12 గంటల వరకు శ్రమించినప్పటికి ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ప్రాజెక్టు ఈఈ (జనరేషన్‌) డి.రమణయ్య వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా మరో 15 రోజుల వ్యవధిలో పూర్తిస్థాయి ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. అత్యంత పురాతన విద్యుత్కేంద్రం కావడం వల్ల తరచూ జనరేటర్లు మొరాయిస్తున్నాయని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని