Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కస్తూర్బాగాంధీ విగ్రహావిష్కరణ

విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న కృష్ణవేణి

మునగపాక, న్యూస్‌టుడే: పాటిపల్లి  కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆదివారం కస్తూర్బా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మావూళ్లో గ్రంథాలయం, స్పందించే హృదయం సంస్థలు సంయుక్తంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశాయి. గ్రామ సర్పంచి ఆడారి కృష్ణవేణి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఏవీఎన్‌ మూర్తి,  స్పందించే హృదయం సంస్థ అధ్యక్షుడు శిష్ట్లా తమ్మిరాజు,  ఆడారి త్రిమూర్తులు, కొయిలాడ నరసింగరావు, త్రిమూర్తులు , పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని