Updated : 12/04/2021 04:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తూనికల్లో మోసాలకు పాల్పడితే చర్యలు

అనకాపల్లిలో కేసు నమోదు చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌

నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), న్యూస్‌టుడే: దుకాణదారులు తూనికల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తూనికలు కొలతలశాఖ ఇన్‌స్పెక్టర్‌ డి.భాస్కర్‌ హెచ్చరించారు. అనకాపల్లి పట్టణంలోని చేపలు, మాంసం విక్రయ దుకాణాల్లో ఆదివారం అయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చేపల మార్కెట్‌లో తూకాల్లో మోసాలను గుర్తించి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. సహచట్టం కార్యకర్త కె.వెంకటరమణ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని