Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

30 ఎకరాల్లో తోటలు దగ్ధం

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: కొండపాలెంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 30 ఎకరాల్లో సరుగుడు, నీలగిరి, చెరకు తోటలు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. అంతా ఎండిపోయి ఉండటంతో క్షణాల్లో మంటలు చుట్టుముట్టేశాయి. రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ముచ్చకర్ల వెంకట అప్పారావు, ముచ్చకర్ల తాతబాబు, కాకర్ల సుజాత తదితర 20 మంది రైతులు నష్టపోయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి పంటలను ఆర్పివేశారు. సర్పంచి ముచ్చకర్ల భవాని, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు ముచ్చకర్ల తాతయ్య తదితరులు బాధితులను పరామర్శించారు.
ఖండివరంలో దుకాణం..
చీడికాడ, న్యూస్‌టుడే: ఖండివరం టిఫిన్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుడు వెన్నెల వెంకినాయుడు వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి టిఫిన్‌ సెంటర్‌లో నిద్రిస్తుండగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పాకలో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెదేపా సీనియర్‌ నేత పీవీజీ కుమార్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించి  ఆర్థికసాయం అందించారు. ఈయనతో పాటు మాజీ ఎంపీపీ కళావతి, నాయకులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని