Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేవల్‌ ఉద్యోగి బలవన్మరణం

మాధవధార, న్యూస్‌టుడే: ఒంటరిగా ఉంటున్న ఒక నేవల్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హర్యానా రాష్ట్రం కస్సాన్‌ జిల్లాకు చెందిన రావిట్‌సింగ్‌(25) నేవల్‌ డాక్‌యార్డ్‌లో సివిలియన్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అశోక్‌ పార్క్‌ వద్ద ఉన్న నేవల్‌ క్యార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకొని తన ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం ఉదయం విధులకు హాజరుకాకపోవడంతో సంబంధిత సిబ్బంది గది వద్దకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని చిన్నాన్న రణధీర్‌సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని