Published : 12/04/2021 22:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరింత గొప్పగా గ్రామాలను అభివృద్ధి చేయాలి

ఆనందపురం: వాలంటీర్ల వ్యవస్థ ద్వారా శక్తిమంతమైన గ్రామాలను మరింతగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆనందరపురంలో వాలంటీర్ల ఉగాది పురస్కారాల పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల పాత్ర అమోగమన్నారు. ఈ మేరకు భీమిలి నియోజకవర్గంలో 891 మంది వాలంటీర్లకు సేవ మిత్ర, సేవ రత్న, సేవ వజ్ర వంటి మూడు విభాగాల్లో నగదు బహుమతులతో పాలు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, జేసీ అరుణ్‌బాబు, జడ్పీ సీఈవో నాగర్జునసాగర్‌, ఆర్డీవో కిషోర్‌ స్థానిక నాయకులు పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని