ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సహించం
Published : 09/05/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సహించం

సుంకరమెట్ట వైద్యాధికారి గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం


వైద్యాధికారితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఫాల్గుణ

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: ప్రజారోగ్యంతోపాటు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ స్పష్టం చేశారు. అరకులోయ మండలం సుంకరమెట్ట, గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శనివారం సందర్శించారు. సుంకరమెట్ట పీహెచ్‌సీలో ఇద్దరి వైద్యుల్లో ఒకరు విధులకు హాజరుకాకపోవడంపై ఆరా తీశారు. ఇద్దరిలో ఒకరు సక్రమంగా విధులకు రావడం లేదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొవిడ్‌ కేసుల వివరాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరవుతున్న వైద్యాధికారి బుజ్జిబాబుపై చర్యలకు తీసుకునే విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు. గన్నెల పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బొండాం, గన్నెల సర్పంచులు బొజ్జ, భాస్కరరావు, నాయకులు రఘునాథ్‌, రామారావు, గాసి, సుమాంజలి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని