పరీక్షలు సరే.. ఫలితాలేవీ?
Published : 09/05/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరీక్షలు సరే.. ఫలితాలేవీ?

ఎనిమిది రోజులుగా ఎదురుచూపులు


అనకాపల్లిలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి రావుగోపాలరావు కళాక్షేత్రంతోపాటు సంచార వాహనంలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేసేందుకు నమూనాలు సేకరిస్తున్నారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి చేస్తున్న పరీక్షల్లో ఇప్పటివరకు 525 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. వీరిలో 18 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి సేకరించిన నమూనాలకు సంబంధించి ఫలితాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు. రోజుకు 150 మంది చొప్పున 1400 మంది ఫలితాలు రావాల్సి ఉంది. గత నెలలో సేకరించిన నమూనాలకు సంబంధించి శనివారం విడుదల చేసిన ఫలితాల్లో అనకాపల్లి పట్టణ పరిధిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. కరోనా బారిన పడిన వారికి మొదటి ఐదురోజులు చాలా కీలకంగా ఉంది. పాజిటివ్‌ అయితే ప్రభుత్వం ఇచ్చే కిట్‌లో ఉన్న మందులు వాడాలి. ఊపిరి అందకపోతే ఆక్సిజన్‌ అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పరీక్షలు చేయించుకుని ఫలితాల కోసం వేచిచూస్తున్న వారంతా ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో చాలామంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఫలితాలు త్వరితగతిన వచ్చేలా అవసరమైతే అనకాపల్లిలో ల్యాబ్‌ను ఏర్పాటు చేసే విషయమై ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని