ఇంధన ఖర్చూ కష్టమాయే..!
Published : 09/05/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంధన ఖర్చూ కష్టమాయే..!

50 శాతం సర్వీసులతో వరుస నష్టాలు

పాడేరు, న్యూస్‌టుడే

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది పాడేరు ఆర్టీసీ డిపో పరిస్థితి. గత కొన్నేళ్లుగా నష్టాల బాటలో నడుస్తున్న ఈ డిపోకు కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన రెండు వారాల కర్ఫ్యూ దెబ్బేసింది. మధ్యాహ్నం 12 గంటల వరకే బస్సు సర్వీసులను నడపాల్సి రావడంతో.. డిపోలోని 36 బస్సుల్లో 15 మాత్రమే రోడ్డెక్కుతున్నాయి. కరోనా రెండో అలకు ముందు ఆర్టీసీ డిపో ఆదాయం రోజుకు రూ.4 లక్షల వరకు ఉండగా.. మూడురోజులుగా రూ.లక్ష మించడం లేదు. రాబడి అంతంతమాత్రంగా ఉన్నా.. రోజూ రెండు వేల లీటర్ల వరకు డీజిల్‌ ఖర్చవుతోంది. మధ్యాహ్నం 12 గంటల్లోగా బస్సులన్నీ డిపోకు చేరాలన్న నిబంధన ఉండటంతో దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను రద్దు చేశారు. పాడేరు నుంచి రాజమహేంద్రవరం, కాకినాడకు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేయడంతో ఆదాయం బాగా తగ్గిందని డిపో మేనేజరు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం పాడేరు డిపో నుంచి అరకులోయ, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి వరకే బస్సులను నడుపుతున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని