కొవిడ్‌తో ఇద్దరు జీవీఎంసీ ఉద్యోగుల మృతి
Published : 09/05/2021 07:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌తో ఇద్దరు జీవీఎంసీ ఉద్యోగుల మృతి

గాజువాక, న్యూస్‌టుడే : జీవీఎంసీ గాజువాక జోనల్‌ కార్యాలయంలో ఉద్యోగులపై కొవిడ్‌ పంజా విసురుతోంది. జోన్‌-6 పట్టణ ప్రణాళిక విభాగం ఛైన్‌మెన్‌(ఎంటీఎస్‌) ఎస్‌.దేవుడు (52), లైసెన్స్‌డ్‌ సర్వేయరు శాంతారావు (59) గత రెండు రోజులుగా ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఇటీవలే నీటి సరఫరా విభాగం బోర్వెల్‌ సెక్షన్‌ సూపర్వైజర్‌ రమేష్‌ కూడా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జోన్‌-6లో ఇంజినీరింగ్‌ విభాగం ఈఈ ప్రసాద్‌బాబు, నీటి సరఫరా ఏఈ రాజ్‌కుమార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు పద్మశ్రీ, రమేష్‌నాయుడు, మోనటరింగ్‌ సెల్‌ అడ్మిన్‌ కార్యదర్శి శాంతిరాజ్‌లు కొవిడ్‌తో బాధపడుతున్నారని జోనల్‌ కార్యాలయ ఇన్‌ఛార్జి సీతారామయ్య తెలిపారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కొవిడ్‌ బాధితులుగా మారడంతో కార్యాలయం వద్ద ప్రవేశాలను కట్టుదిట్టం చేశారు. గత ఏడాది ఇదే సీజనులో ఒక ఏఈ, నలుగురు ఉద్యోగులు కొవిడ్‌తో మృతి చెందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని