2,505 మందికి పాజిటివ్‌
Updated : 09/05/2021 07:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2,505 మందికి పాజిటివ్‌

ఒక్క రోజులో ఇదే  అత్యధికం

ఈనాడు-విశాఖపట్నం: జిల్లాలో కరోనా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కొత్తగా 2,505 కేసులు నమోదైనట్లు ఉత్తరాంధ్ర జిల్లాల కొవిడ్‌-19 ప్రత్యేకాధికారి, ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తెలిపారు. కొవిడ్‌ వచ్చినప్పటి నుంచి ఒక్క రోజులో ఇవే అత్యధికమన్నారు. మరోవైపు 1185 మంది తాజాగా డిశ్ఛార్జి అయినట్లు వెల్లడించారు. కొత్తగా వ్యాధి బారిన పడుతున్న వారి కంటే, డిశ్ఛార్జి అయ్యే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో కొవిడ్‌ ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ కావడం లేదు.. ఆక్సిజన్‌ పడకల కోసం డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. గత 24గంటల వ్యవధిలో వైరస్‌ మరో 12 మందిని పొట్టనపెట్టుకుంది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 96,125కు చేరిందని డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. మొత్తం 688 మంది మృతి చెందారన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో మరణాలు 0.71శాతంగా ఉన్నట్లు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని