దేవస్థానం పాలకమండలిలో మార్పులు
Published : 09/05/2021 07:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవస్థానం పాలకమండలిలో మార్పులు

ట్రస్టీ దాడి దేవి తొలగింపు.. మరో మహిళకు అవకాశం

సింహాచలం (అడివివరం), న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానం పాలకమండలిలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.వాణీమోహన్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో నియమించిన పాలక మండలిలో సభ్యురాలైన విజయవాడకు చెందిన దాడి దేవిని తొలగించారు. ఆమె స్థానంలో విశాఖ నగరానికి చెందిన ఆళ్ల భాగ్యలక్ష్మీని నియమిస్తూ జీవో 255ను విడుదల చేశారు. భాగ్యలక్ష్మీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్‌కు ఉత్తర్వులు జారీచేశారు. పాలకమండలికి మిగిలిన ఉన్న గడువు మేరకు ఆమె ట్రస్టీగా కొనసాగనున్నారు. కాగా దాడి దేవి తొలగింపునకు కారణాలను జీవోలో తెలియజేయలేదు.
మంత్రితో విభేదాలే కారణమా..!: విజయవాడకు చెందిన దాడి దేవి భర్త దాడి జగన్‌ అక్కడ నగర వైకాపా అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే దేవికి బీసీ కోటాలో సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డులో స్థానం లభించింది. దాడి జగన్‌కు, ఓ మంత్రి మధ్య ఉన్న విభేదాలే ట్రస్టుబోర్డు నుంచి దేవి తొలగింపునకు కారణమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల అప్పన్న స్వామి పూలతోట అభివృద్ధి పనుల్లో దాడి దేవి, జగన్‌ దంపతులు చురుగ్గా పాల్గొన్నారు. మొక్కల పంపెకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి తమవంతు సహకారం అందించారు. అనూహ్యంగా ఆమెను ట్రస్టీగా తొలగించడం దేవస్థానంలో చర్చనీయాంశమైంది. కొత్తగా నియమించిన భాగ్యలక్ష్మీ తొలగింపునకు గురైన దాడి దేవి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని