అనధికారికంగా... మెడికల్‌ ఆక్సిజన్‌ విక్రయాలు
Published : 09/05/2021 07:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనధికారికంగా... మెడికల్‌ ఆక్సిజన్‌ విక్రయాలు

 వలపన్ని పట్టుకున్న ఔషధ నియంత్రణ అధికారులు
12 ఆక్సిజన్‌ సిలిండర్లు స్వాధీనం

ఎం.వి.పి.కాలనీ, పెదవాల్తేరు, న్యూస్‌టుడే: కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొంతమంది వ్యాపారులు అనధికారికంగా అధిక ధరలకు వీటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని కొన్ని సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
* డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీతా తమకు మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరమని ఎంవీపీకాలనీ సెక్టారు-3లోని మోరే స్మార్ట్‌ సొల్యూషన్‌ అధినేత జగదీష్‌కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించారు. దీనికి ఆయన తమ వద్దకు సాయంత్రం స్టాక్‌ వస్తుందని, ఒక్కో సిలిండర్‌ ధర రూ.55వేలు అవుతుందని పేర్కొన్నారు. తిరిగి సాయంత్రం మరోసారి సంప్రదించగా, తమ వద్ద పెద్ద సిలిండర్లు మాత్రమే ఉన్నాయని, వాటి ధర రూ.78వేలుగా తెలిపారు.
* దీంతో అనుమానం వచ్చిన ఆమె విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులను సంప్రదించారు. దీంతో అధికారులతో కూడిన బృందం మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం సాధారణ వినియోగదారులుగా వెళ్లి సంప్రదించారు. అయితే సిలిండర్‌కు రూ.50వేలు నగదు రూపంలోను, మిగిలిన రూ.28వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాలని షరతు విధించారు.
* అతని వద్ద మెడికల్‌ ఆక్సిజన్‌ను నిల్వ చేయటానికి, విక్రయించటానికి ఎలాంటి అనుమతులు లేకపోవటంతో వెంటనే అక్కడున్న 68 లీటర్ల సామర్థ్యం కలిగిన 10 మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు, 48 లీటర్ల సామర్థ్యం కలిగిన 2 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.ఎన్‌.వి.వి.ఎస్‌.కల్యాణి పంచనామా రాసిన తర్వాత ఎంవీపీకాలనీ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం రాత్రి సమయంలో వాటిని అప్పగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని