ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు
logo
Published : 18/06/2021 03:52 IST

ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు

తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని వైకాపా నేతలకు తెదేపా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్‌ తదితరులతో కలిసి గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విశాఖ వ్యవహారాలపై స్థానిక వైకాపా నేతలు మాట్లాడితే బాగుంటుందని, ఎక్కడి నుంచో వచ్చిన నేతలు ఇక్కడ మాట్లాడడం సరికాదన్నారు. మాన్సాస్‌ ట్రస్టు భూములపై ఎందుకు దృష్టి పెట్టారో ప్రజలకు ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. సింహాచలం దేవస్థానం భూముల్లో ఏళ్ల తరబడి ఉంటున్న వారికి న్యాయం చేయాలన్నారు. గతంలో ఓ ఐటీ సంస్థకు  భూముల కేటాయింపు కుదరదన్నా...ఆ సంస్థకు నేడు మళ్లీ ఎందుకు ఆహ్వానం పలికారని ప్రశ్నించారు. కమీషన్ల కోసం వైకాపా నేతలు ఆశపడుతున్నారని విమర్శించారు. ఆయా అంశాలపై ప్రజలకు వైకాపా ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.
తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌ మాట్లాడుతూ ఇంటి పన్నుల పెంపు అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పంచగ్రామాల భూ సమస్యపై వైకాపా నేతలు సమావేశం నిర్వహించారని విమర్శించారు. మాన్సాస్‌ సంస్థ ఎంతో మంది పేదలకు విద్యా దానం చేసిందన్నారు. వేలాది ఎకరాల భూములను దానంగా ఇచ్చిన పూసపాటి వంశీయులపై విమర్శలు చేయడం తగదన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని