11 మందికి... బ్లాక్‌ ఫంగస్‌
logo
Published : 18/06/2021 03:52 IST

11 మందికి... బ్లాక్‌ ఫంగస్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే:  జిల్లా వ్యాప్తంగా కొత్తగా 11 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయని, వీటితో బాధితుల సంఖ్య 214కు చేరిందని ఏఎంసీ ప్రిన్సిపల్‌ సుధాకర్‌ తెలిపారు. కొత్తగా వచ్చిన కేసుల్లో కేజీహెచ్‌లో ఒకరు, ప్రైవేటు ఆసుపత్రుల్లో పది మంది చేరారన్నారు. కేజీహెచ్‌లో ఒకరు మృతి చెందడంతో ఈ సంఖ్య 18కి చేరిందన్నారు. ఇంతవరకు 66 మంది డిశ్ఛార్జి అయ్యారని, 39 మంది నిబంధనలు ఉల్లంఘించి ఇళ్లకు వెళ్లిపోయారన్నారు. చనిపోయిన వారు, కోలుకున్నవారు, వెళ్లిపోయిన వారిని మినహాయిస్తే ప్రస్తుతం 91 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని