కొత్తగా 237 కొవిడ్‌ కేసులు
logo
Published : 18/06/2021 03:51 IST

కొత్తగా 237 కొవిడ్‌ కేసులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు మరింత తగ్గింది. తొలిసారి 3శాతం లోపునకు పాజిటివిటీ రేటు తగ్గడంతో వైద్య వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 8వేల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరగ్గా 237 కొత్త కొవిడ్‌ కేసులు (2.95శాతం) వచ్చాయని ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ తెలిపారు. తాజా కేసులతో బాధితుల సంఖ్య 1,46,677కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 238 మంది కోలుకోగా వీరి సంఖ్య 1,40,832కు చేరిందన్నారు. ప్రస్తుతం 4,846 మంది చికిత్స పొందుతున్నారన్నారు. ఒకరోజు వ్యవధిలో ముగ్గురు మృతి చెందడంతో ఈ సంఖ్య 999కు చేరిందన్నారు. కశింకోటకు చెందిన 70ఏళ్ల మహిళ, వరహాపురానికి చెందిన 27ఏళ్ల వ్యక్తి, గిడుతూరుకు చెందిన 65ఏళ్ల మహిళ కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని