రూ.10 లక్షల విలువైన గుట్కా పట్టివేత
logo
Published : 18/06/2021 03:51 IST

రూ.10 లక్షల విలువైన గుట్కా పట్టివేత

గాజువాక, న్యూస్‌టుడే : అక్రమంగా గుట్కా, ఖైనీలను నిల్వ ఉంచి విక్రయాలు సాగిస్తున్న వ్యాపారిపై గాజువాక పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల మేరకు... కణితిరోడ్డు కైలాస్‌నగర్‌లో డి.సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి తన ఇంట్లో గుట్కా, ఖైనీలు, పాన్‌ మసాలా పెద్ద ఎత్తున నిల్వ ఉంచారన్న సమాచారంతో సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐలు దాడులు జరిపారు. సుమారు రూ.10లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కొన్ని లైసెన్స్‌ పత్రాలు చూపించారని, వాటిపైనా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని