‘ తనఖా కాదు... ఆస్తులు చూపెడుతున్నాం’
logo
Published : 18/06/2021 03:51 IST

‘ తనఖా కాదు... ఆస్తులు చూపెడుతున్నాం’

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ నుంచి రాష్ట్రానికి అప్పు తీసుకురావాలంటే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులు చూపించాల్సి ఉంటుందని, దానిని తనఖా పెడుతున్నట్లుగా ప్రచారం చేయడం సరికాదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత విధానాన్నే ప్రభుత్వం అనుసరిస్తుంటే, రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఆస్తి పన్ను పెంపు కేవలం 15శాతం మాత్రమే ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మూలధన విలువపై పన్ను విధించే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 375 చదరపు అడుగుల స్థలంలో ఇళ్లకు రూ.50 మాత్రమే ఆస్తి పన్ను విధించడం ద్వారా పేదలకు ఎంతో ఉపశమనంగా ఉంటుందన్నారు. తన ఎంపీ ల్యాడ్‌ నిధులను కల్యాణ మండపాల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. అనకాపల్లి ఎంపీ రూ.21లక్షలు అభివృద్ధి పనులకు కేటాయించగా, రూ.38లక్షలతో అంబులెన్సు సౌకర్యం కల్పించేలా జీవీఎంసీకి నిధులు అందజేశారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని