మూడో విడత చందనసమర్పణకు సన్నాహాలు
logo
Published : 18/06/2021 03:51 IST

మూడో విడత చందనసమర్పణకు సన్నాహాలు

చందనం అరగదీతలో పాల్గొన్న ట్రస్టీలు, అర్చకులు

సింహాచలం (అడివివరం), న్యూస్‌టుడే: జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 24న అప్పన్న స్వామికి మూడో విడతగా చందన సమర్పణ చేసేందుకు ఆలయవర్గాలు సన్నాహాలు ప్రారంభించాయి. ఆ మేరకు గురువారం చందనం చెక్కల అరగదీత ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అధికారులు, అర్చకులు ఆలయ భాండాగారంలోని చందనం చెక్కలను బయటకు తీసి సిబ్బందికి అందజేశారు. బేడామండపంలోని రాళ్లపై సిబ్బంది చందనం అరగదీశారు. తొలిరోజు 28 కిలోల చందనం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్టీలు వారణాసి దినేశ్‌రాజ్‌, సూరిశెట్టి సూరిబాబు, సిరిపురపు ఆశాకుమారి, ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు గంట్ల శ్రీనుబాబు, అర్చకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని