ఎన్‌టీఎస్‌ఈలో తిరుమల విద్యార్థుల ప్రతిభ
logo
Published : 18/06/2021 03:51 IST

ఎన్‌టీఎస్‌ఈలో తిరుమల విద్యార్థుల ప్రతిభ

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నేషనల్‌ టాలెంట సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ ప్రథమ స్థాయిలో నగరంలోని తిరుమల ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపినట్లు తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓబీసీ కేటగిరిలో పి.యశ్వంత్‌ శ్రీనివాస్‌ 1వ ర్యాంకు, బి.మాన్విత 3వ ర్యాంకు, జి.నిహారిక 7, ఎస్‌.యశ్వంత్‌ 9, ఎం.కమల్‌లోచన్‌ 10 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. ఓసీ కేటగిరిలో పి.నవీన్‌కుమార్‌ 17వ ర్యాంకు సాధించి రెండవస్థాయి పరీక్షకు అర్హత పొందారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అకడమిక్‌ డైరెక్టర్లు ఇ.మృత్యుంజయరావు, ఎం.సత్యనారాయణ, కేఎన్‌వీవీ సత్యనారాయణ, జి.సతీష్‌బాబు అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని