మహాస్తూప నిర్మాణాన్ని వేగంగా పూర్తి చెయ్యండి
logo
Published : 18/06/2021 03:51 IST

మహాస్తూప నిర్మాణాన్ని వేగంగా పూర్తి చెయ్యండి

తిమ్మాపురం(గ్రామీణభీమిలి), న్యూస్‌టుడే: దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, పురావస్తుశాఖ కమిషనరు జి.వాణిమోహన్‌ భీమిలి బీచ్‌రోడ్డులోని ప్రఖ్యాత బౌద్ధారామం మంగమారిపేట తొట్లకొండను జిల్లా అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. గతంలో కురిసిన వర్షాలకు కూలిన మహాస్తూపం నిర్మాణ పనులను, నాణ్యతను పరిశీలించారు. పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.  గొల్లల తిమ్మాపురంలోని బావికొండ బౌద్ధారామానికి వెళ్లి ఆరామాలను, కింది ఘాట్‌రోడ్డు ప్రవేశ మార్గంలోని వసతి కేంద్రం నిర్మాణాన్ని పరిశీలించారు.  అనంతరం ఆర్కేబీచ్‌లోని విశాఖ ప్రదర్శనశాలకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో పురావస్తుశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శీర వెంకటరావు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ కోట నరసింహనాయుడు, దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనరు కె.శాంతి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని