45 రోజుల పసికందుకు మిస్‌-సి చికిత్స
logo
Published : 18/06/2021 03:51 IST

45 రోజుల పసికందుకు మిస్‌-సి చికిత్స

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : నలభై అయిదు రోజుల చిన్నారికి మిస్‌-సి చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు రామ్‌నగర్‌ ఓమ్నీ గిగిల్స్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గురువారం ఆసుపత్రి ఎం.డి. డాక్టర్‌ రాధాకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించి ఈ వివరాలు తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన 45 రోజుల పసికందుకు జ్వరం, దుద్దుర్లు, శ్వాస సంబంధ ఇబ్బందులు ఉంటే ఈనెల 6న వైద్యం కోసం చేర్పించారు. శిశువుకు మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమెటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ (మిస్‌-సి) వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించి వైద్యమందించగా మూడు రోజుల్లో కోలుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందన్నారు. ఇంత చిన్న వయసులో మిస్‌-సి రావడంతో మన ప్రాంతంలో అరుదన్నారు. వైద్యులు సి.హెచ్‌.విశ్వతేజ, సుకుమార్‌ చిత్తూరి, శేషగిరి, రాజశేఖర్‌, రాజారమేష్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని