కరోనా కాలంలో పన్నుల భారమా?
logo
Published : 18/06/2021 03:51 IST

కరోనా కాలంలో పన్నుల భారమా?

మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : చెత్తపై పన్ను విధించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్‌ అన్నారు. కిర్లంపూడి లేఔట్‌ పీసీసీ ప్రధాన కార్యదర్శి నివాసంలో గురువారం  నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో వైసీపీకి ఓటు వేస్తే అన్ని పన్నులు రద్దుచేస్తామని హామీ ఇచ్చిన మాట మరిచారా అన్నారు. కరోనా కష్టకాలంలో ఇంటి పన్నులు, చెత్తపై పన్నులు పెంచడం సరికాదన్నారు. కరోనా ఉద్ధృతి సమయంలో రోగులకు కనీసం ఆక్సిజన్‌ కూడా సరిగా ఇవ్వలేని ప్రభుత్వమని విమర్శించారు. పడకలు, వైద్య సదుపాయల విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి జి.ఎ.నారాయణరావు, కాంగ్రెస్‌ నాయకులు గొంప గోవిందరాజు, గుర్తుల శ్రీనివాసరావు, మూల వెంకటరావు, వాసుదేవరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని